న్యాయదేవత సాక్షిగా అబలకు అన్యాయం17 - 23 ఫిబ్రవరి 2020 8 పేజీలు సంపుటి:1 సంచిక : 53 విశాఖపట్నం వెల: 5/

న్యాయదేవత సాక్షిగా (ప్రజాప్రతినిధి - నిఘా విభాగం) : “న్యాయ వ్యవస్థ పక్కదారులు పడ్తోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు” అంటూ ముగ్గురు 'సుప్రీం' న్యాయమూర్తులు కొన్ని నెలల క్రితం దేశ చరిత్రలో తొలిసారిగా షతికా విలేకర్ల సమావేశంలో మాట్లాడి, దేశ ప్రజలను దిగ్ర్భాంతికి గురిచేసిన సందర్భాన్ని ఇంకా మరచిపోలేదు. అలా న్యాయవ్యవస్థపై వారుచేసిన వాఖ్యలు అక్షర సత్యాలని నిరూపించే యదార్థ సంఘటనే ఇది ! “వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు. కాని, ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు” అనే న్యాయ సూత్రాన్ని విస్మరించిన న్యాయమూర్తుల తీర్పునకు నిదర్శనమే ఈ దుస్సంఘటన! ప్రజాస్వామ్యానికి న్యాయవ్యవస్థ, రక్షణ వ్యవస్థ, పత్రికా రంగం, రాజకీయ రంగం మూల స్తంభాలు వంటివి. కాని ఇందులో ఏ ఒక్క మూల స్తంభమైనా ఆ కుటుంబానికి దన్నుగా నిలబడివుంటే ఈ రోజున బాధాతప్త హృదయంతో మేము ఈ వార్తను ప్రచురించాల్సిన అవసరం లేదు. యావత్ దేశ ప్రజలు ఆ కుటుంబానికి జరిగిన అన్యాయం వింటే, చలించే హృదయమే వుంటే కన్నీరు మున్నీరు కాకతప్పదు. అంతే కాదు, న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పునకు అసలు దోషులైన మహా విశాఖ నగరపాలక సంస్థ కమీషనర్లు, నగర ప్రణాళికా విభాగం అధికార్లు, సిబ్బంది, ముఖ్యంగా సర్వేయర్లు