వదిలి వెళ్లను

చైనాలోని వుహాన్‌లో 76 రోజుల తర్వాత లాక్‌డౌన్‌ తొలగించారు. ఇన్నాళ్లూ అక్కడే ఉండి అంబులెన్సుల సైరన్‌ శబ్దాలు, చైనీస్‌ భాషలోని రేడియో మెజేస్‌లు మాత్రమే వింటూ గడిపిన అనిల పి అజయన్‌ అనే కేరళ యువతి.. ప్రపంచమంతా కరోనా తగ్గే వరకు వుహాన్‌ను వదిలి ఎక్కడికీ వెళ్లనని అంటున్నారు. పొరపాటున కూడా తను కరోనా వాహకం కాదలచుకోలేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని అమె చెబుతున్నారు. ‘‘మనకు సోకుతుందేమోనన్న భయం కంటే.. మన నుంచి సోకుతుందేమోనన్న భయం ఉంటే ప్రపంచంలో ఇప్పుడిన్ని కరోనా కేసులు, మరణాలు ఉండేవే కావు’’ అని అంటున్న అనిల.. ‘‘ఆ.. భయం వల్లనే.. కేరళ నుంచి మా వాళ్లు ఫోన్‌ చేసి రమ్మంటున్నా.. నేను వెళ్లడం లేదు’’ అని నవ్వుతూ అంటున్నారు. అనిల వుహాన్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రో బయాలజీలో పోస్ట్‌ డాక్టొరల్‌ రిసెర్చ్‌ చేస్తున్నారు.