ఏపీలో మందు కోసం తెలంగాణ మద్యంప్రియుల క్యూ

కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో మద్యం షాపులు మూతబడ్డాయి. తాజాగా లాక్‌డౌన్ 3.0 అమల్లోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం గ్రీన్, ఆరెంజ్ జోన్లలో లిక్కర్ షాపులకు అనుమతి ఇచ్చింది. దీంతో ఇన్నాళ్లూ మద్యంలేక అల్లాడిపోయిన మద్యంప్రియులకు ప్రాణం లేచొచ్చినంత పనైంది. సోమవారం (మే 4) ఉదయం నుంచే వైన్ షాపుల వద్ద బారులు తీరారు. దేశవ్యాప్తంగా పలు మద్యం దుకాణాల వద్ద కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి.