నాగబాబు దేవుడు! ప్రాణం పోయినా రోజా ఆ పని చేయరు: గెటప్ శ్రీను

కామెడీ అంటే జబర్దస్త్.. జబర్దస్త్ అంటే కామెడీ అంటారు తెలుగు కామెడీ లవర్స్. ఒకప్పుడు జబర్దస్త్ షోలో హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, సుడిగాలి సుధీర్.. ఇలా కమీడియన్స్ వేసే పంచ్‌లు ఎంత ఫేమస్సో.. నాగబాబు నవ్వులు కూడా అంతే ఫేమస్. అయితే.. జబర్దస్త్‌కి దీటుగా మొదలైన ‘అదిరింది’ షోకి కొందరు కమెడియన్స్‌తో పాటు నాగబాబు వెళ్లిపోవడంతో ఫన్ రైడ్‌లో గెలుపు ఎవరిది అన్న చర్చ మొదలైంది. మొదట్లో ఛాలెంజ్‌లు విసుకుని సై అంటే సై అన్నారు. ఇక నాగబాబు రెమ్యునరేషన్ కోసమే జబర్దస్త్‌ని వదిలేసి..అదిరింది షోకి వెళ్లారనే ప్రచారం నడిచింది. దీనిపై క్లారిటీ ఇచ్చారు జబర్దస్త్ కమెడయిన్ గెటప్ శ్రీను