సీఏ కొత్త పరీక్ష తేదీలు ఇవే..!

మరోసారి సీఏ పరీక్షలు వాయిదాపడ్డాయి. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) మరోసారి సీఎ పరీక్షల్ని వాయిదా వేసింది. మేలో జరగాల్సిన పరీక్షల్ని జూన్‌ 19 నుంచి జులై 4 వరకు జరుపుతామని ప్రకటించింది. కానీ మే 17 వరకు లాక్‌డౌన్ పొడిగించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. సీఏ ఫౌండేషన్ కోర్స్, సీఏ ఇంటర్మీడియట్, సీఏ ఫైనల్ కోర్స్ ఎగ్జామ్స్ జూలై, ఆగస్టులో నిర్వహించనుంది. ఈ పరీక్షల్ని రాయబోయే విద్యార్థులు తాజా వివరాల కోసం ఐసీఏఐ అధికారిక వెబ్‌సైట్ఇక క్లాస్ 12 విద్యార్థులు సీఏ ఫౌండేషన్ కోర్సులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వారి పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. ఫలితాలతో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ విద్యార్థులు పరీక్ష పాస్ కాకపోతే రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవుతుంది. మరిన్ని వివరాలకు ఐసీఏఐ అధికారిక వెబ్‌సైట్